భారత్ ఎంతో ముఖ్యమైన దేశం : వాంగ్ యి
- December 11, 2017
భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నట్లు చైనా మరోసారి స్పష్టం చేసింది. అసియాలోనే బలమైన దేశాలుగా భారత్-చైనాలు కలిసే ముందుకు సాగాలని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి అభిలషించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడే చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లాం వివాదాన్నికూడా నిగ్రహంతో, దౌత్యపరంగానే చైనా పరిష్కరించుకుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతికి చైనా కృషి చేస్తుందన్నారు.
డోక్లాం సరిహద్దులోకి భారత దళాలు అక్రమంగా ప్రవేశించినా.. చైనా ఉద్రిక్తతలు పెంచకుండా.. దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించిందని చెప్పారు. భారత్-చైనా దేశాలు భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉందని.. ఆయన చెప్పారు. గత అనుభవాల వల్ల ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అనుమానాలు, సందేహాలు చాలానే ఉన్నాయని.. అయితే వాటిని నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వాంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, రష్యా, భారత్ దేశాల చర్చల్లో భాగంగా వాంగ్ యి పాల్గొననున్నారు. డోక్లాం వివాదం తరువాత చైనా అత్యున్నత మంత్రి ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







