డిసెంబర్ 14న గ్రహాంతరవాసుల గురించి ప్రకటించనున్న నాసా
- December 11, 2017
ప్రపంచం మొత్తం ఇప్పుడు డిసెంబర్ 14న నాసా చేయబోయే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గ్రహాంతర వాసులు ఉన్నాయా?.. వాటి మనుగడ ఎలా కొనసాగుతోంది? వాటి వల్ల మానవాళికి నిజంగా ముప్పు ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆరోజే దొరకబోతోంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా గత కొన్నేళ్లుగా ఈ విషయపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలకి 2500కి పైగా ఏలియన్ల జాడలు కనిపించినట్లు సమాచారం. ఈ మేరకు అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని గురువారం నిర్వహించబోయే సమావేశంలో వెల్లడించనున్నారు.
గోల్డీలాక్ జోన్లో ఇవి పరిభ్రమించే ప్రాంతాలను గుర్తించారు. జీవజాలం అభివృద్ధి చెందడానికి ఆ ప్రాంతాల పరిస్థితులు అనుకూలిస్తాయని శాస్త్రవేత్తలు గతంలోనే వెల్లడించారు. గూగుల్ సంస్థ అందించిన మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను నాసా అధ్యయనం చేసింది. వాషింగ్టన్‌లోని నాసా హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ పౌల్ హెర్ట్జ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!