తమిళనాడులో సహాయచర్యలకు రూ.500కోట్లు--జయలలిత
- November 16, 2015
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న తమిళనాడులో సహాయచర్యలకు రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 71 మంది మృత్యువాతపడ్డారు. దీంతో జయలలిత సహాయ, పునరావాస చర్యలకు రూ.500కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో సహాయకచర్యల కోసం ఆర్మీ సహాయాన్ని కోరారు. పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తిస్థాయిలో ప్రజలకు సహాయసహకారాలను అందించాలని జయలలిత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. వర్షాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2.5లక్షల నుంచి రూ.4 లక్షలదాకా నష్టపరిహారం అందిస్తామని జయలలిత తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







