ఆ 'తోకచుక్క' పై ఆరా.. దూసుకొచ్చిన ' సిగార్ '

- December 12, 2017 , by Maagulf
ఆ 'తోకచుక్క' పై ఆరా.. దూసుకొచ్చిన ' సిగార్ '

గ్రహాంతర వాసుల ఆచూకీపై నాసా తన రీసెర్చ్ ముమ్మరం చేస్తుండగా, తాజాగా ఓ " సిగార్ " షేప్ లోని కామెట్ ఇటీవల భూమివైపు దూసుకు వచ్చిన ఉదంతం సంచలనం రేపింది. ఏలియెన్ కామెట్ గా భావిస్తున్న ఈ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ మీద బ్రిటన్ లో రీసెర్చ్ ప్రారంభమైంది. ఇది సౌర వ్యవస్థ నుంచి భూమి వైపు వచ్చినట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. " ఒమువామువా " అనే రీసెర్చర్ దీన్ని కనుక్కోవడంతో ఈ ఆబ్జెక్ట్ ని అలాగే వ్యవహరిస్తున్నారు. ఇది సోలార్ సిస్టంలో కనబడిన మొట్టమొదటి ఇంటర్ సెల్లార్ ఆబ్జెక్ట్ అని రష్యన్ బిలియనీర్ యురీ మిల్నర్ అంటున్నారు.

ఇది భూమిపైని టెలిస్కోప్ ల పరిధిని దాటి వచ్చిందని, బహుశా యేలియెన్ స్పేస్ షిప్ కూడా అయి ఉండవచ్చునని అంటున్నారు. దీన్ని స్కాన్ చేసే పనిలో పడ్డారు రీసెర్చర్లు. మరో గ్రహంపై జీవజాలం మీద జరిపే పరిశోధనలకోసం మిల్నర్ వంద మిలియన్ డాలర్ల ఖర్చుతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. అటు-సిగార్ ఆకారంలోని ఈ వస్తువు అసాధారణంగా ఉందని, గ్రహాంతరవాసులు కృత్రిమంగా పంపిన వస్తువు కూడా అయి ఉండవచ్చునని మిల్నర్ సలహాదారుల్లో ఒకరైన లిస్టన్ అభిప్రాయపడ్డారు. రేడియో సిగ్నల్స్ ఆధారంగా దీన్ని పంపి ఉండవచ్చునేమో అన్నారాయన.

ఈయన ఆధ్వర్యంలోని బృందం వెస్ట్ వర్జీనియాలోని అత్యంత శక్తిమంతమైన గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ ని ఉపయోగించుకుని ఈ వింతైన తోకచుక్క మీద పరిశోధనలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com