14న టీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి ఉమా
- December 12, 2017
మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. వారు ఈనెల 14వతేదీన టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈమేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. కాగా... తెలుగుదేశం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఉమా మాధవరెడ్డి... టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే ఊహగానాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఊహాగానాలను నిజం చేస్తూ 14వతేదీన తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నారు. టీ టీడీపీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి టీడీపీ నుంచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







