యాక్సిడెంట్‌ జరిగిన 12 నిమిషాల్లోనే ట్రాఫిక్‌ క్లియర్‌

- December 12, 2017 , by Maagulf
యాక్సిడెంట్‌ జరిగిన 12 నిమిషాల్లోనే ట్రాఫిక్‌ క్లియర్‌

దుబాయ్‌:దుబాయ్‌లో రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, అలాగే దుబాయ్‌ పోలీస్‌ సంయుక్తంగా ఓ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగితే, ప్రమాదం జరిగిన 12 నిమిషాల్లోగా ట్రాఫిక్‌ని క్లియర్‌ చేయడం ఈ కార్యాచరణ తాలూకు ఉద్దేశ్యం. ట్రాఫిక్‌ సంబంధిత ఎక్స్‌పెన్సెస్‌ని 25 శాతం తగ్గించడం ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశ్యమని ఆర్‌టిఎ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కీలక అంశాల్ని ఆర్‌టిఎ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఛైర్మన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మట్టర్‌ అల్‌ తాయెర్‌, దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ ఖలిఫా అల్‌ మర్రి సమక్షంలో చర్చించడం జరిగింది. దుబాయ్‌లో మెగా ఈవెంట్స్‌ సందర్భంగా ట్రాఫిక్‌ విషయమై తీసుకోవాల్సిన చర్యల గురించీ ఈ సమావేశంలో చర్చించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రుల్ని రికార్డు సమయంలో ఆసుపత్రులకు తరలించడం, అలాగే సంఘటనా స్థలం నుంచి క్లూస్‌ని సేకరించడం, ఆ వెంటనే ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా చూడటం వంటి చర్యల ద్వారా వాహనదారులకు ఊరటనిచ్చేందుకు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com