గుండె పోటుతో మరణించిన గోవాకి చెందిన ప్రవాసియ భారతీయుడు
- December 13, 2017
కువైట్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కొందరు ప్రవాసీయులు ఆకస్మికంగా మరణించి తమ కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. గోవా నుండి భారత జాతీయుడు డిగో రిమ్మీ ఫెర్నాండెజ్, అద్దెకు కార్లను ఇచ్చేఅల్-సేయర్ సంస్థలో పని చేసేవారు. ఆయన 58 సంవత్సరాల వయస్సులో గుండెకు సంబంధించిన వ్యాధి కార్డియక్ అరెస్ట్ కారణంగా ఈ నెల 10 వతేది (గురువారం) ఆకస్మికంగా చనిపోయారు. ఉన్నాడు. తన భార్య జోసెఫిన్ ఫెర్నాండెజ్ మరియు కుమార్తె డయానా ఫెర్నాండెజ్ లను అనాథలను చేసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. కాగా డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు రేపు 14/12/2017 ( (గురువారం) ఉదయం 11:30 గంటలకు కువైట్ నగరంలోని హోలీ ఫ్యామలీ కేథడ్రల్ చర్చి వద్ద జరుగుతాయి. ది క్రిస్టియన్ సెమెట్రీ , సులైబికత్ వద్ద ఖననం చేయబడుతుంది. డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ ఆత్మకు శాంతి కలగాలని కువైట్ లోని పలువురు ప్రవాస భారతీయులు ప్రార్థిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







