ఇస్లామిక్ సహకార సంస్థ అసాధారణ సమావేశంలో పాల్గొన్న శ్రీ ఎమిర్
- December 13, 2017
కతర్: ఇస్లామిక్ సహకార సంస్థ అసాధారణ సమావేశంలో శ్రీ ఎమిర్ షేక్ తమిం బిన్ హమద్ అల్-థని పాల్గొన్నారు, బుధవారం ఉదయం ఇస్తాంబుల్ లోని కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ ఐ సి ) యొక్క అసాధారణ సదస్సు ప్రారంభ సమావేశంలో అధికారిక ప్రతినిధి బృందం పాల్గొంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం గుర్తించాలని అమెరికా పరిపాలన శాఖ యొక్క నిర్ణయం తద్వారా తలెత్తుతున్న పరిణామాలు ఈ సమావేశంలో చర్చించారు. టర్కిష్ విదేశాంగ మంత్రి మేవ్లుట్ కావస్సోలు ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ ఐ సి) సంస్థ "నియంతృత్వానికి నిలుపుదల " చేస్తున్నట్లు చెప్పడానికి నేడు సమావేశమయ్యామని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా ఉన్న అల్ ఖుద్స్ ని కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంకు గుర్తింపు ఇవ్వడం మానవ మనస్సాక్షికి వ్యతిరేకంగా ఒక హానికరమైన చర్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దశలో అమెరికా ఇజ్రాయెల్ యొక్క జెరూసలేంను ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాలను చట్టబద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని దుయ్యబట్టారు."ఇస్లామిక్ దేశాలు ఈ ప్రకటనతో నిశ్శబ్దంగా ఉంటుందని అమెరికా భావిస్తుందని వారు అనుకున్నట్లు మనం నిశ్శబ్దంగా ఉండకూడదు, అగ్ర రాజ్యాంగా ఉన్నామని విర్రవీగుతూ ఈ బెదిరింపులు శాంతి అవకాశాన్ని తొలగిస్తుంది అమెరికా సంయుక్త నిర్ణయం మనకు సంబంధించినంతవరకు శూన్యంగా ఉంది, "అని కావస్సోగ్లు చెప్పారు.పాలస్తీనియన్లు జాతీయ సయోధ్య మరియు ఐక్యతలను సాధించడానికి ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ ఐ సి) సంస్థ ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







