హాట్ టాపిక్ గా మారిన బ్రహ్మాజీ ఇంట్లో జరిగిన పార్టీ
- November 16, 2015
సినిమా సెలెబ్రెటీలు తమకు అవకాశం చిక్కితే చాలు నైట్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతారు. ప్రకాష్ రాజ్ లాంటి కొందరు స్టార్స్ తమ ఫామ్ హౌస్ లో తరుచు తన సినిమా ప్రెండ్స్ ను పిలిచి లేట్ నైట్ పార్టీలు ఇవ్వడం గతంలో చాల జరిగాయి. అయితే ఎప్పుడూ పెద్దగా వార్తలలో కనిపించని నటుడు బ్రహ్మాజీ ఇంట్లో ఈమధ్య జరిగిన ఒక లెట్ నైట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలను బ్రహ్మాజీ కోడలు సెలబ్రిటీ స్టైలిస్ట్ ఇంద్రాక్షి పట్నాయక్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఈ పార్టీ చిల్డ్రన్స్ డేనాడు జరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చిల్డ్రన్స్ డేనాడు మందు పార్టీలు ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేసారు. ఈ పార్టీలో బ్రహ్మాజీకి సన్నిహితంగా టాలీవుడ్ స్టార్స్ రవితేజ, రానా, వరుణ్ తేజ్, నాని, సందీప్ కిషన్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా ఈ పార్టీలో పాల్గొని తెగ సందడి చేసారు అని టాక్. ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ కూడా ఈ పార్టీలో పాల్గొన్నది అని తెలుస్తోంది. బ్రహ్మాజీ కోడలు ఇంద్రాక్షి పట్నాయక్ రవితేజ, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, రెజీనా, రానాలకు స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటులలో ఒక విలక్షణ నటుడిగా పేరు గాంచిన బ్రహ్మాజీ ఇంట్లో జరిగిన ఈ పార్టీ వెనుక ఉద్దేశ్యాలు ఏమిటీ అంటూ అప్పుడే ఫిలింనగర్ లో చర్చలు మొదలయ్యాయి. టాప్ స్టార్స్ అంతా గ్రాండ్ గా పార్టీ చేసుకున్న ఈ మిడ్ నైట్ హంగామా ఇప్పుడు టాలీవుడ్ కు హాట్ టాపిక్.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







