అమర్నాథ్ గుహలో ఇకపై మంత్రం వినిపించదు
- December 14, 2017
హిందువుల ఆలయాలు మంత్రోచ్ఛారణకు నిలయాలు. ఆలయంలోకి ప్రవేశించగానే పండితుల వేద మంత్రాలు చెవులకు వీనుల విందుగావిస్తాయి. హారతి కర్పూరపు వాసనలు, ద్వారంలోని గంటలు భక్తులను దేవుని దగ్గరకు చేరుస్తుంది. అయితే ఇకపై హిందువులు అతి పవిత్రంగా భావిచే ఆదిశంకరుడు కొలువైన అమరనాథ్ ఆలయంలో మాత్రం మంత్రాలు, గంటల జైజై ధ్వానాలు వినిపించకూడదని ఆలయ అధికారులని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డ్ (ఎన్జీటీ) ఆదేశించింది. వీటితో పాటు మరికొన్ని ఆంక్షలు కూడా పెట్టింది. భక్తులు క్యూలైన్ పాటించాలని, దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మొబైల్స్ తదితర వస్తువులను తీసుకువెళ్లరాదని, భక్తులు తమ వస్తువులు భద్రపరుచుకునేందుకు స్టోర్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఎన్జీటీ ఆదేశించింది. ఆలయ మార్గంలో షాపులకు అనుమతివ్వరాదని పేర్కొంది. వివిధ ప్రాంతాలనుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి భక్తులు అమర్నాథ్ను సందర్శిస్తారు. వారికి సరైన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతని విస్మరించరాదని అధికారులను మందలించింది. ఆలయ పవిత్రతను కాపాడాలంటూ ఎన్జీటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







