టీడీపీకి గుడ్ బై చెప్పనున్న యలమంచిలి రవి
- December 14, 2017
కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలబోతోంది. జిల్లాలో లక్షలాది మంది క్యాడర్ కలిగిన బలమైన నాయకుడు, మాజీ MLA యలమంచిలి రవి, తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు. జగన్ పాదయాత్ర విజయవాడ వచ్చినప్పుడు రవి వైసీపీలో చేరతారని అనుచరులు చెప్తున్నారు. TDP నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో యలమంచిలి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న నాయకుల్లో రవి ఒకరు. గతంలో రవి తండ్రి యలమంచిలి నాగేశ్వర్రావు కూడా MLAగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కంకిపాడు నుంచి దేవినేని నెహ్రూపై నాగేశ్వర్రావు MLAగా గెలిచారు. 2009లో ఆయన తనయుడు రవి PRP నుంచి పోటీ చేసి విజయవాడ తూర్పు MLAగా విజయం సాధించారు. రవి కూడా నెహ్రూపైనే గెలవడం విశేషం. జిల్లాలో బలమైన క్యాడర్ ఉన్న రవి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే జగన్ సమక్షంలో ఆయన YCP తీర్థం పుచ్చుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







