హైదరాబాద్ IT హబ్‌ కావడంలో బాబు కృషి అమోఘం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

- December 14, 2017 , by Maagulf
హైదరాబాద్ IT హబ్‌ కావడంలో బాబు కృషి అమోఘం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

'హైదరాబాద్ ఈ రోజున అలా ఉందంటే దానికి కారణం నేనే'.. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పేమాట. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు తరచూ సెటైర్లు వేయడం పరిపాటి. అయితే తాజాగా టీఆర్ఎస్ కీలకనేత.. సాక్షాత్తూ తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ చంద్రబాబుకి వత్తాసుపలకడం సంచలనమైంది. సైబరాబాద్‌ సృష్టికర్త చంద్రబాబేనని, ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత ఆయనదేనని కేటీఆర్‌ తేల్చి చెప్పేశారు. అంతేకాదు, ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘం.. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంలో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుందని కూడా ఆయన అన్నారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుందని కూడా కేటీఆర్ చెప్పారు. హైటెక్స్‌ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ ఇలాంటి ఆసక్తికర సమాధానాలిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com