గిన్నిస్ రికార్డు సృష్టించిన 'చైనా' న్యూడిల్...
- December 15, 2017
చైనాకు చెందిన పుడ్ కంపెనీ ప్రపంచంలో అత్యంత పొడవైన న్యూడిల్ ని తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని తయారీకి 40 కిలోల బ్రెడ్ పిండి, 26.8లీటర్ల నీళ్లు, 0.6 కిలోల ఉప్పుని ఉపయోగించారు. 66 కిలో గ్రాముల బరువు 10,119 అడుగులు ఉన్న ఈ న్యూడిల్ ను పూర్తిగా చేతితోనే తయారు చేశారు. ఈ న్యూడిల్ తయారుచేయడానికి 17 గంటలు పట్టిందట. గిన్నిస్ అధికారి ఈ న్యూడిల్ పొడవును లెక్క వేయడానికి 3 గంటలు పట్టిందట. 2001వ సంవత్సరంలో జపాన్ తయారుచేసిన 1800 అడుగుల పొడవైన న్యూడిల్ రికార్డును ఈ న్యూడిల్ బద్దలు కొట్టడం విశేషం. చైనా సంప్రదాయం ప్రకారం సీనియర్స్ డే రోజున న్యూడిల్ పొడవును పెద్దవారి ఆయుష్షుతో పోలుస్తారు. అది ఎంత పొడవుగా ఉంటే అంతకాలం వారి ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు. గిన్నిస్ రికార్డు సృష్టించిన ఈ న్యూడిల్ ను చైనాకు చెందిన పుడ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







