విఐపి ఉచిత దర్శనాల పై మండిపడుతున్న శ్రీవారి భక్తులు

- December 15, 2017 , by Maagulf
విఐపి ఉచిత దర్శనాల పై మండిపడుతున్న శ్రీవారి భక్తులు

లియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కమిటీల భారం ఎక్కువైంది. ప్రోటోకాల్‌ పేరుతో వందల మంది ఉచిత దర్శనాలు చేసుకుంటూ స్వామివారి ఆదాయానికి గండికొడుతున్నారు. అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ ఛైర్మన్‌ మూర్తి మరో ముగ్గురితో కలిసి వెంకన్న దర్శనానికి వచ్చారు. వీరితో పాటు దాదాపు వంద మంది L 1 దర్శనాలు చేసుకున్నారు. వారందరికీ టీటీడీ అధికారులు సముచిత మర్యాదలు చేశారు. ఈ తతంగంపై భక్తులు మండిపడ్డారు. కమిటీల పేరుతో వచ్చిన వారితో తమకు దర్శనం ఆలస్యం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతులు చెప్పేవారే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు. 

గడచిన  వారం రోజుల్లోనే నాలుగు కమిటీలు తిరుమలకు విచ్చేశాయి. అసలు సభ్యులు ఇద్దరు ముగ్గురుంటే... వారితో వచ్చేవారు వందమంది దాకా ఉంటున్నారు. వారందరికీ వసతి, దర్శనాలు, ప్రసాదాలు కూడా ఉచితంగా అందించాల్సి వస్తోంది. దీంతో అనవసర ఇబ్బందులు తలెత్తడంతో పాటు... టీటీడీ ఆదాయానికీ గండి పడుతోంది. కమిటీల పేరుతో సాగుతున్న ఈ తంతుపై భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే దీనిపై దృష్టిసారించి... కఠిన నియమావళి రూపొందించాలని కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com