పొడుగుకాళ్ల సుందరిగా రికార్డు సాధించిన ఎకతెరీనా లిసినా
- December 16, 2017
లాంగెస్ట్ లెగ్స్ బ్యూటీగా రష్యాకు చెందిన ఎకతెరీనా లిసినా గిన్నిస్ రికార్డు కొట్టేసింది. ఈమె పొడవు 6 అడుగుల 8 అంగుళాలకు పైగా ఉంటే.. లిసినా కాళ్లే నాలుగడుగులకు పైగా పొడవుండడం విశేషం. ఈమె కుడికాలు కంటే ఎడమకాలు కాస్త పొడవుగా ఉంది. పొడుగుకాళ్ల సుందరిగా రికార్డు సాధించడంతో లిసినా సంబరపడిపోతోంది. పొడవుకాళ్లున్న అమ్మాయిలు చాలా అందంగా కూడా ఉంటారని చెబుతోంది లిసినా. కాళ్లు పొడుగ్గా ఉండడం వల్ల మిగతా వాళ్లకంటే వేగంగా కూడా నడవచ్చని జోక్ చేస్తోంది. అబ్బాయిలు కూడా పొడవు కాళ్ల సుందరిలంటే పడిచస్తారని చెబుతోంది లిసినా. ఈ పొడుగుకాళ్ల సుందరి రోడ్డుపై కనిపిస్తే చాలు అందరూ ఆమెతో పొటోలు దిగేందుకు సరదా పడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఇక మోడల్ కావాలన్న తన డ్రీమ్ నిజం చేసుకునేందుకు సిద్ధమైంది ఈ లాంగెస్ట్ లెగ్స్ బ్యూటీ. కానీ పొడుగ్గా ఉండడం వల్ల కష్టాలు కూడా ఉన్నాయంటోంది లిసినా. సరిపోయే బట్టలు దొరకడం లేదని చెబుతోంది. కార్లో కూర్చోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, టెలిఫోన్ బూత్‌లో నిలబడాలన్నా కష్టంగా ఉందని అంటోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల