మెగా ఫ్యామిలీతో కృష్ణంరాజు వియ్యం... సోషల్ మీడియాలో హల్‌చల్
- December 16, 2017టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ పెళ్లి పై అనేక రకాల వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. బాహుబలి సినిమా పూర్తి అయ్యాక ప్రభాస్ పెళ్లి అని పెద్దనాన్న కృష్ణంరాజు ప్రకటించిన తరువాత అనేక వార్తలొచ్చాయి. భీమవరం అమ్మాయితో అని ఒకసారి, వైజాగ్ బిజినెస్ మ్యాన్ కుమార్తె తో ముహుర్తం ఖరారు అని మరోసారి పుకార్లు షికారు చేసాయి. కాగా దుబాయ్ సినీ క్రిటిక్ ప్రభాస్ అనుష్కల ప్రేమ త్వరలో పెళ్లి అని ట్విట్ తో సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు . ఇప్పటికే ప్రభాస్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు జాతాకాలు ముఖ్యమని హింట్ ఇచ్చాడు. తాజాగా సరికొత్త పుకారు షికారు చేస్తుంది. కృష్ణంరాజు మెగా ఫ్యామిలీతో వియ్యం అందేందుకు రెడీ అవుతున్నట్లు ఫిల్మినగర్ లో టాక్. మొగళ్తూరు నుంచి వచ్చిన కృష్ణంరాజు చిరంజీవిల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీకి చెందిన నిహారికా ప్రభాష్ ల పెళ్లి జరిగితే బాగుంటుందని కొందరి సన్నిహితుల అభిప్రాయమట. ఈ విషయం కృష్ణంరాజుకి సన్నిహితులు చెప్పగా చిరంజీవితో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సాహో షూటింగ్ లో బిజీగా వున్న ప్రభాష్ స్పందించాల్సి వుంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు