రామోజీ రావు వేసిన 'థియేటర్' ప్లాన్
- December 16, 2017
పత్రికా రంగంలో రారాజు ఈనాడు. అధినేత రామోజీ రావుని మీడియా మొఘల్ అంటారంటే, ప్రింట్ మీడియాలో ఈనాడు పెత్తనం, రామోజీ తెలివితేటలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవొచ్చు. రామోజీ ఏ పని మొదలెట్టినా అది గ్రాండ్ సక్సెసే. ఫిల్మ్ సిటీ సూపర్ హిట్. ప్రియా పచ్చడి హిట్. మార్గదర్శి బంపర్ హిట్. ఉషాకిరణ్ మూవీస్ హిట్టు మీద హిట్టు. ఇంగ్లీష్ డైలీ విషయంలోనే రామోజీ తప్పటడుగు వేశాడు. ఆ తరవాత ఏ వ్యాపారం మొదలెట్టినా మరింత ఆచి తూచి వ్యవహరించడం మొదలెట్టారు. ఇప్పుడు రామోజీ మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. ఈసారి హోమ్ థియేటర్ పై రామోజీ దృష్టిసారించార్ట. హోం థియేటర్ అంటే మన టీవీకి పెట్టుకునే సౌండ్ సిస్టమ్ తరహా కాదు. సెలబ్రెటీల ఇళ్లలో ఓ మినీ థియేటరే ఉంటుంది కదా.. ఆ తరహా అన్నమాట. విదేశాల్లో హోం థియేటర్స్‌కి బాగా అలవాటు పడుతున్నారు జనం. ఇక్కడ కూడా ఆ సంస్ర్కృతి పెరుగుతోంది.
ఒక్కో థియేటర్ రూపకల్పనకూ రూ.10 నుంచి 25 లక్షల వరకూ అవుతుందని తెలుస్తోంది. అధునాతన సౌండ్ టెక్నాలజీ, శాటిలైట్ తో అనుసంధానం.. లాంటి విషయాల్లో మేటిగా అనిపించుకున్న ఓ కంపెనీతో రామోజీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలు బయటకు రాబోతున్నాయని తెలుస్తోంది. మరి ఈ కొత్త వ్యాపారంలో రామోజీ ఎన్ని అద్భుతాలు సృస్టిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







