దుబాయ్ లో 'గల్ఫ్ NRI పాలసీ' పాట విడుదల

- December 16, 2017 , by Maagulf

దుబాయ్:గల్ఫ్ కార్మికుల అవగహన వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ NRI పాలసీ సాధన కొరకు తెలంగాణ NRI పాలసీ పాట విడుదల చేసారు.తెలంగాణ NRI పాలసీ లాభాలను గురించి వివరిస్తూ వీడియో పాటను దుబాయ్ లో ఆవిష్కరించారు. ఈ పాట ను గాయకుడు రచయిత రాంపూర్ సాయి రచించారు.ఈ కార్యక్రమము లో మన తెలంగాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పాలసీ ప్రభుత్వ ఆమోదం పొందాలనే దిశగా నిర్వాహకులు గల్ఫ్ లో నివసిస్తున్న తెలంగాణా వాసుల నుండి లక్ష సంతకాలు సేకరిస్తున్నారు. ఇది ఒక ప్రభంజనంలా ప్రభుత్వాన్ని చేరి శీఘ్రంగా ప్రభుత్వ ఆమోదం పొందాలని ఆకాక్షించారు.ఈ సంస్థ అధ్యక్షులు కృష్ణ దోనికేని అందరూ కలిసి మెలిసి కృషి  చేసి NRI పాలసీ సాధించాలని పిలుపునిచ్చారు.పాలసీ సాధనకై తమ పూర్తి సహకారం ఉంటుందని జువ్వాడి శ్రీనివాస్ తెలియజేసారు.మీడియా తరఫును తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని శ్రీకాంత్ చిత్తర్వు తెలియజేసారు.తదనంతరం గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో భూమేశ్వర్ గౌడ్ ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో రవి కట్కం ,మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ దోనికేని, అరుణ్ కుమార్ సురునిదా,రాజు సట్ల, ఆకుల సురేందర్,శ్రీనివాస్ ,సత్యం అడువల,శ్రీకాంత్ చిత్తర్వు,రాజేశ్వర్  మంగళరాపు , జువ్వాడిశ్రీనివాస్,వేణు , ప్రవీణ్ పటేల్ , జనగాం శ్రీను , క్రాంతి(తిరుపతి) , కాడారి శ్రీను , సంపత్ , అష్రఫ్ , వంశీ గౌడ్ , భుమేశ్వర్ , చంద్ర మౌళి  తదితరులు పాల్గొన్నారు.

ఈ పాట కొరకు https://youtu.be/1L5czhNfsMI లింక్ ని క్లిక్ చెయ్యగలరు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com