జీఎస్‌టీ పరిధిలోకి బిట్‌కాయిన్!
- December 16, 2017
దిల్లీ: అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌ను వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది! ఇప్పటికే దేశంలోని ప్రధాన బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజీలపై పరోక్ష పన్నుల శాఖ అధికారులు సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. జీఎస్‌టీలో ఏ పన్నురేటు కింద దీనిని చేరిస్తే బాగుంటుందని ఆయా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని తెలిసింది.
ఆదాయ పన్నుల శాఖ అధికారులు బుధవారం బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజీలైన జెబ్‌పే, యునోకాయిన్, కాయిన్ సెక్యూర్ సంస్థల్లో ఆదాయ పన్ను చట్టం 133ఏ ప్రకారం సర్వే నిర్వహించారు. బిట్‌కాయిన్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందిన వారు పన్నులు ఎగవేస్తున్నారో ఏమోనన్న అనుమానమే దీని వెనక కారణం. ామదుపర్లు, ట్రేడర్లు.. వారు జరిపిన లావాదేవీలు, అవతలి పక్షం వాళ్ల గుర్తింపు, సంబంధిత బ్యాంకు ఖాతాలను తెలుసుకుని సాక్ష్యాలను సేకరించడం్ణ ఈ సర్వే ఉద్దేశం.
అధికారులు రెండు నెలల క్రితమే బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజీల వ్యాపార నిర్వహణ నమూనా, గతేడాది వచ్చిన ఆదాయంపై ఎంత పరోక్ష పన్ను లేదా సేవల పన్ను, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధించవచ్చని ప్రశ్నించినట్టు తెలిసింది. బిట్‌కాయిన్‌పై సరైన చట్టాలు లేకపోవడంతో ఏ పన్ను విధించాలన్న అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందట. పరోక్ష పన్నుల కిందకు రాదు కాబట్టి జీఎస్‌టీ కిందకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది! 2012లో రెండు డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ ఈ ఏడాది చివర్లో 17,900 డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







