బ్యాడ్ వెదర్: దుబాయ్ సఫారీ మూసివేత
- December 17, 2017
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున దుబాయ్ సఫారీ పార్క్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం), వాతావరణ పరిస్థితుల్లో అప్పటికప్పుడు విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది గనుక, అప్రమత్తంగా ఉండాలని రెసిడెంట్స్‌కి సూచించింది. భారీ వర్ష పాతం పలు ప్రాంతాల్లో కురవనుందని ఎన్‌సిఎం హెచ్చరించింది. ఇప్పటికే దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాక, దుబాయ్ సఫారీ పార్క్ యధాతథంగా సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని దుబాయ్ మునిసిపాలిటీ ప్రకటించింది. సఫారీ పార్క్‌లో జంతువుల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. డిసెంబర్ 12న ప్రారంభమైన దుబాయ్ సఫారీ పార్క్‌లో వివిధ రకాలైన 2,500 జంతువులు ఉన్నాయి. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







