ఉమ్ అల్ హస్సామ్‌లో అల్ అదిల్ ప్రారంభం
- December 17, 2017
మనామా: ప్రముఖ నటి తమన్నా ఉమ్ అల్ హస్సామ్‌లో 39వ అల్ అదిల్ సూపర్ మార్కెట్ స్టోర్‌ని ప్రారంభించారు. 'మసాలా కింగ్'గా సుపరిచితుడైన డాక్టర్ ధనంజయ్ దతార్ ఈ షోరూం ప్రారంభోత్సవంలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాపర్ చిమ్నీ రెస్టారెంట్‌గా ఏర్పాటయిన ఈ అల్ అదిల్ సూపర్ మార్కెట్ బహ్రెయిన్‌లో మూడవది. క్వాలిటీతో కూడిన ఫుడ్ స్టఫ్ అందించడం, అది కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరతో అందించడం తమ ప్రత్యేకత అని డాక్టర్ ధనంజయ్ దతర్ చెప్పారు. అల్ అదిల్ ఎంటర్‌ప్రైజెస్ ఎదుగుతున్న తీరు పట్ల తమన్నా ప్రశంసలతో ముంచెత్తారు. అల్ అదిల్ కొత్త షోరూం ప్రారంభోత్సవం నేపథ్యంలో 200 ఐటమ్స్‌పై 50శాతం ఆఫర్‌ని అందిస్తున్నారు. బహ్రెయిన్‌లోని మనామాలో అల్ హమ్రా సినిమా యెదురుగా ఒకటి, యతీమ్ సెంటర్‌లో ఇంకొకటి అల్ అదిల్ సూపర్ మార్కెట్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







