అగ్ని ప్రమాదం: ముగ్గురు కార్మికుల మృతి
- December 18, 2017
అల్ కోజ్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నిద్రలోనే ముగ్గురు కార్మికులు మృతి చెందడం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియా 3 లో ఈ ప్రమాదం తెల్లవారు ఝామున 4.50 నిమిషాల సమయంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వేర్ హౌస్ ఓ ప్రైవేటు సంస్థకు చెందినది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి మొహమ్మద్ హమీద్ మాట్లాడుతూ, ఫైర్‌ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి పక్కనే వున్న మరో రెండు వేర్ హౌస్‌లకు కూడా మంటలు వ్యాపించాయనీ, మొత్తం 50 మందికి పైగా ఫైర్ ఫైటర్స్ ఆ మంటలతో పోరాడి, వాటిని అదుపు చేశాయని చెప్పారు. 4 గంటల పాటు జరిగిన ఈ ఫైట్ అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు వ్యాపించగానే, చాలామంది కార్మికుల్ని అక్కడినుంచి పంపివేసినా, ముగ్గురు మాత్రం అందులో ఇరుక్కుపోయి మృతి చెందినట్లు వేర్ హౌస్ యజమాని తెలిపారు. మృతదేహాల్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి అటాప్సీ నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







