ఒమన్‌ కోస్ట్‌లో భూకంపం: తీవ్రత 4.9

- December 19, 2017 , by Maagulf
ఒమన్‌ కోస్ట్‌లో భూకంపం: తీవ్రత 4.9

మస్కట్‌: అరేబియన్‌ సీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం తీవ్రత 4.9 గా రిక్టర్‌ స్కేల్‌పై నమోదయ్యింది. ఈ వివరాల్ని సుల్తాన్‌ ఖబూస్‌ యూనివర్సిటీలోగల ఎర్త్‌ క్వేక్‌ మానిటరింగ్‌ సెంటర్‌ వెల్లడించింది. ఈ భూకంపం గురించి ఓ అధికారి స్పందిస్తూ, భూకంప కేంద్రం దుక్మ్‌ ప్రాంతానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉందనీ, ఉదయం 11.44 నిమిషాల సమయంలో ఈ భూకంపం చోటు చేసుకుందనీ చెప్పారు. భూకంపానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com