'టాయ్‌లెట్' ను మెచ్చిన బిల్ గేట్స్
- December 19, 2017
ముంబయి: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ'. శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వూహించని రీతిలో విజయం సాధించింది. అయితే ఈ సినిమా భారతీయులకే కాదు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కి కూడా చాలా నచ్చిందట. 2017లో జరిగిన స్ఫూర్తిదాయకమైన అంశాలపై బిల్‌గేట్స్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఒక్కో అంశం గురించి ప్రశంసించారు. అందులో 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' చిత్రం కూడా ఉండటం విశేషం. '2017 చాలా కఠినంగా గడిచిన ఏడాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో అద్భుతమైన జ్ఞాపకాలను కూడా ఇచ్చింది. భారత్‌లో ప్రతి పది మందిలో ఒకరు అశుభ్రం కారణంగానే చనిపోతున్నారు. 'టాయ్‌లెట్' చిత్రం నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ప్రజలకు కనువిప్పు కలిగేలా చేసింది.' అని గేట్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌కి జోడీగా భూమి పెడ్నేకర్ నటించారు. అక్షయ్ నటించిన చిత్రాల్లో రూ.100 కోట్లు దాటిన ఎనిమిదో చిత్రం 'టాయ్‌లెట్:ఏక్ ప్రేమ్‌కథ'.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల