తెలంగాణ ఎన్నారైలకు ఊహించని అవకాశం ఇచ్చిన కేసీఆర్

- December 19, 2017 , by Maagulf
తెలంగాణ ఎన్నారైలకు ఊహించని అవకాశం ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఎన్నారైలకు ఊహించని చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ బిడ్డల భాగస్వామ్యం కూడా అత్యంత ముఖ్యమైనదని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి వచ్చిన 450 మంది ఎన్ఆర్ఐలు అనూహ్యమైన అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారు.

ఈ ఆదివారం ఎన్నారైలతో ప్రగతి భవన్ లో భేటీ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబుల్ బెడ్ రూంలు పరిశీలించి అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపుతో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలనకు ఎన్ఆర్ఐలు బయలు దేరుతున్నారు. ప్రప్రథమంగా బుదవారం గజ్వేల్ నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్, ఎడ్యుకేషనల్ హబ్, డబుల్ బెడ్ రూం పనులను ఎన్ఆర్ఐలు పరిశీలించనున్నారు.

గజ్వేలు తర్వాత సిద్ధిపేటలో డబుల్ బెడ్ రూం, ఇతర అభివృద్ధి పనులు పరిశీలించి రాత్రికి ఎన్నారైలు హైదరాబాద్ చేరుకోనున్నారు. గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు ఎన్ఆర్ఐలు వెళ్లనున్నారు.

బుధవారం ఉదయం 10.30కు హోటల్ మారి గోల్డ్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎన్నారైల బృందం బయలుదేరనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com