'సన్నీ నైట్స్‌'కు సన్నీ కూడా రాదట!

- December 19, 2017 , by Maagulf
'సన్నీ నైట్స్‌'కు సన్నీ కూడా రాదట!

బెంగళూరు: కొత్త సంవత్సరాన్నిఆహ్వానించేందుకు బాలీవుడ్‌ నటి సన్నీలియోనీతో 'సన్నీ నైట్స్‌'ను నిర్వహిస్తున్నామని టైమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. బెంగళూరులోని మాన్యత టెక్‌పార్కులో 'సన్నీ లియోనీ నైట్స్‌' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇందుకు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ అనుమతి ఇవ్వలేదు. గతంలో సన్నీ కేరళకు వెళ్లినప్పుడు అక్కడ అభిమానులు ఆమెను చుట్టుముట్టి, వాహనాలకు ఆటంకం కలిగించారని ఇప్పుడు కూడా ఇలాగే జరిగితే తాము బాధ్యులం కాదని పేర్కొన్నారు. దీనిపై తాజాగా సన్నీ ట్విటర్‌ ద్వారా స్పందించారు. కార్యక్రమం కన్నాతనకు ప్రజల క్షేమమే ముఖ్యమని తెలిపారు. 'బెంగళూరు పోలీసులు నాకు, ప్రజలకు భద్రత కల్పించలేమని చెప్పారు. నాకు ప్రజల క్షేమమే ముఖ్యం. కాబట్టి నేను కూడా ఆ కార్యక్రమానికి రావాలనుకోవడం లేదు.

గాడ్‌ బ్లెస్‌. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని సన్నీ ట్వీట్‌లో పేర్కొన్నారు. శనివారం సునిల్‌ కుమార్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఈ కార్యక్రమం గురించిమాట్లాడారు. పోలీసుల అనుమతి లేకుండా సన్నీ నైట్స్‌ను నిర్వహిస్తే నిర్వాహకులను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించారు.

దాంతో నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కార్యక్రమ నిర్వహణకు అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com