"2 కంట్రీస్" సినిమా సెన్సార్ కంప్లీట్..

- December 20, 2017 , by Maagulf

దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "2 కంట్రీస్". సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ అందుకొని డిసెంబర్ 29న విడుదలకు సన్నద్ధమవుతోంది. 
మలయాళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న "2 కంట్రీస్"కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్ కి విశేషమైన స్పందన లభించింది. అద్భుతమైన కంటెంట్ తో సినిమాలు తీయగల దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు, "జై బోలో తెలంగాణా, శ్రీరాములయ్యా, భద్రాచలం, జయం మనదేరా" వంటి చిత్రాలతో తనదైన మార్క్ వేసిన శంకర్ "2 కంట్రీస్"తో మరోమారు ఆడియన్స్ ను అలరించనున్నారు. 
ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ.. "అధికశాతం షూటింగ్ అమెరికాలో చేయబడడమే కాక గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కిన ఎంటర్ టైనింగ్ ఫిలిమ్ "2 కంట్రీస్". సునీల్ కామెడీ టైమింగ్, స్టోరీ నేరేషన్ హైలైట్స్ గా ఈ చిత్రం రూపొందింది. అలాగే.. 30 ఇయర్స్ పృధ్వీ, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక గోపీసుందర్ ఆర్.ఆర్ సినిమాలోని ఎమోషన్స్ ను హైలైట్ చేస్తుంది. "2 కంట్రీస్" ప్రేక్షకుల్ని అమితంగా ఎంటర్ టైన్ చేస్తుందన్న పూర్తి నమ్మకం మాకుంది. సెన్సార్ పూర్తయ్యింది, డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది" అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com