భూమికా చావ్లా రీ ఎంట్రీకి రెడీ
- November 18, 2015
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భూమికా చావ్లా తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటోంది. గ్లామర్ క్యారెక్టర్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతమైన చిత్రాల్లోనటించిన భూమిక బాలీవుడ్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. విజయవంతమైన భారత క్రికెట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో భూమిక మరోసారి వెండితెరమీద దర్శనమివ్వనుంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాలో భూమిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు చిత్రయూనిట్. బాలీవుడ్ లో తేరేనామ్, గాంధీ మై ఫాదర్, రన్ లాంటి సినిమాల్లో నటించిన భూమిక నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ప్రస్తుతానికి బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నభూమిక సరైన క్యారెక్టర్ దొరికితే సౌత్ లో కూడా ఎంట్రీకి రెడీ అంటోంది.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







