ఆర్టిఎ - లైఫ్‌టైమ్ ఎలక్ట్రానిక్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్
- December 22, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ - ఆర్టిఎ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్తగా లైఫ్‌టైమ్ ఎలక్ట్రానిక్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్స్‌ని జారీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. 2018 జనవరి నుంచి ప్రారంభించి, 2018 సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మేషన్ డ్రైవల్లో భాగంగా ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. ముందు ముందు ఈ విధానాన్ని అన్ని సర్వీసులకూ అమలు చేస్తారు. స్మార్ట్ సిటీస్ ఇనీషియేటివ్స్‌లో ఇది అత్యంత కీలకమైన ముందడుగు. ప్రజల్లో సంతోషం కోసం చేపడుతున్న వ్యూహాత్మక చర్యగా దీన్ని అభివర్నిస్తున్నారు. ఆర్టిఎ లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అబ్దుల్లా యూసెఫ్ అల్ అలి మాట్లాడుతూ, వినియోగదారుల సమయాన్ని ఈ కార్డులు ఎంతగానో తగ్గిస్తాయని చెప్పారు. ఈ సర్వీసుని ఆర్టిఎ - దుబాయ్ లేదా దుబాయ్ డ్రైవ్ యాప్స్ ద్వారా పొదడానికి వీలుంది. ప్రాథమిక దశలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, కార్ రెంటల్స్ ఆఫీసులు, మరియు ట్యాక్సీలకు ఈ సర్వీసు అందిస్తారు. ఆ తర్వాత రెండో స్టేజ్‌లో ప్రైవేట్ కంపెనీలకు, మూడో స్టేజ్‌లో ఇండివిడ్యువల్స్‌కి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







