ఫిలిప్పైన్స్ ఫెర్రీ మునక: 4మంది మృతి
- December 22, 2017
మణిలా: 251 మందితో ప్రయాణిస్తున్న ఒక బోటు ఫిలిప్పైన్స్ తీరంలో మునిగిపోయిన ఘటనలో నలుగురు మరణించారని, మరో ఏడుగురి జాడ తెలియటం లేదని అధికారులు చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ బోటు రాజధాని మణిలా సమీపంలో మునిగిపోయిందని విపత్తు నిర్వహణా విభాగం, కోస్ట్‌గార్డ్ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు. ఈ ఫెర్రీ మునిగిన సమాచారం తెలుసుకున్న సమీప ప్రాంతాల మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్ అధికారులు సహాయక బోట్లను పంపి దాదాపు 240 మందిని రక్షించారని ఆయన చెప్పారు.
క్విజోన్ ప్రావిన్స్‌లోని రియల్ టౌన్‌కు ఎనిమిది మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది సంఖ్య తేలే వరకూ గాలింపు, సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని కోస్ట్‌గార్డ్ ప్రతినిధి కెప్టెన్ అర్మాండ్ బలిలో చెప్పారు. రక్షించిన వారిలో అధికశాతం మందిని దినాషియాన్ రేవుకు చేర్చామని, మిగిలిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు మునిగిపోయారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం వేకువ సమయంలో రియల్ టౌన్ నుండి వస్తున్నపుడు ఈ ఫెర్రీ మునిగిపోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







