ఖతార్‌లో బహ్రెయినీ సెయిలర్ అరెస్ట్
- December 23, 2017
మనామా: బహ్రెయినీ సెయిలర్ మరో ఇద్దరు ఖతారీ అథారిటీస్ స్వాధీనంలో ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి ప్రవేశించినట్లుగా ఆరోపిస్తోన్న ఖతార్, ఈ అరెస్టుల్ని ధృవీకరించింది. బహ్రెయిన్‌కి చెందిన 30 ఏళ్ళ ముస్తఫా హసన్, మరో ఇద్దరు బోటులో చేపలు పడుతుండగా, వారి బోట్లో ఫ్యూయల్ అయిపోవడంతో అనుకోకుండా ఖతార్ జలాల్లోకి ప్రవేశించారు. వీరిని నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఖతారీ కోస్ట్‌గార్డ్ టీమ్ అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. చేపలు పట్టేందుకోసం గత వారంలో వీరు బహ్రెయిన్‌లోని కోస్టల్ విలేజ్ ఆఫ్ అల్ దైర్ నుంచి వెళ్ళినట్లుగా బాధితుల బంధువులు పేర్కొన్నారు. మిగతా ఇద్దరు వ్యక్తుల్ని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు. ఖతారీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు అరెస్ట్ అయినవారిని ప్రవేశపెట్టి, అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగినట్లు సమాచారమ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







