మస్కట్ కొత్త ఎయిర్పోర్ట్ నుంచి తొలి విమానం టేకాఫ్
- December 23, 2017
మస్కట్: ఒమన్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబందించి కీలకమైన ముందడుగు వేసింది. తొలి ట్రయల్ ప్యాసింజర్ విమానాన్ని ఉదయం 11.15 నిమిషాలకు కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ చేయడం జరిగింది. ఒమన్ ఎయిర్ విమానం డబ్ల్యు వై 2001, ఎయిర్పోర్ట్ రన్ వే నుంచి పైకెగిరింది. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉందని ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఒకరు చెప్పారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటూ క్రూ మెంబర్స్ వివరించారు. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సిఇఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ జాబి ప్రారంభించారు. తొలి విమానానికి హఫెజ్ అల్ ఖట్టారి పైలట్‌గా వ్యవహరించారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్‌కి చెందిన పలువురు ప్రముఖులు, స్పెషలిస్ట్‌లు, మీడియా రిప్రెజెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల