తొలి హైడ్రోజన్ పవర్డ్ ట్యాక్సీ ట్రయల్ దుబాయ్‌లో
- December 23, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) తొలి ఎలక్ట్రానిక్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ టయోటా మిరాయ్‌ని దుబాయ్ ట్యాక్సీ ఫ్లీట్‌లో భాగంగా ట్రయల్ రన్ షురూ చేసింది. అల్ ఫుత్తైమ్ మోటార్స్ సహకారంతో ఈ వాహనాల్ని దుబాయ్ ట్యాక్సీ ఫ్లీట్‌లోకి చేర్చనున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, ఐషడరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్, ఈ ట్రయల్ రన్‌ని ప్రారంభించారు. హైడ్రోజన్ ఫ్యూయల్, జీరో ఎమిషన్స్ - ఓన్లీ వాటర్ ఎమిషన్స్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ వాహనం ఎలాంటి శబ్దాన్నీ చేయదు. ట్యాంక్ ఒక్కసారి ఫుల్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రీ-ఫిల్లింగ్ కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టయోటా సంస్థ ఈ కార్లను తయారు చేసింది. ట్యాక్సీ రంగంలో ఇదొక సంచలనం కాబోతోందని ఆర్‌టిఎ, టయోటా సంస్థల ప్రతినిథులు చెప్పారు. అల్ ఫుత్తైమ్ మోటార్స్ ఇటీవలే ఎయిర్ లిక్విడ్‌తో కలిసి సంయుక్తంగా తొలి హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్‌ని యూఏఈలో దుబాయ్ ఫెస్టివల్ సిటీ వద్ద ప్రారంభించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







