దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి
- December 23, 2017
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో... సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా తేల్చింది. లాలూకు జనవరి 3న శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. లాలూను దోషిగా ఖరారు చేయడంతో.. ఆయన్ను రాంఛీ జైలుకు తరలించారు.
దాణా కుంభకోణంలో అప్పటి బీహార్ సీఎం లాలూ, జగన్నాథ్ మిశ్రాలతో పాటు 22 మందిపై అభియోగాలు మోపారు. 1991-96 మధ్య కాలంలో దియోగఢ్ ట్రెజరీ నుంచి దాణా కోసం 89 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్టు... లాలూతో పాటు 34 మందిపై 1997లో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా, మిగిలిన వారు అప్రూవర్లుగా మారారు. అప్పుడు బీహార్‌లో ఉన్న దేవగఢ్ ఇప్పుడు జార్ఖండ్‌లో ఉంది.
చియబస ట్రెజరీ నుంచి 37.5 కోట్లు అక్రమంగా ఉపసంహరించిన కేసులోనూ లాలాకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలుతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. అంతేగాక.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైల్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇదే కేసులో జార్ఖండ్ హైకోర్టు 2014లో స్టే విధించింది. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది.
1996, జనవరి 27న దాణా కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దాణా పంపిణీ పేరిట మనుగడలో లేని కంపెనీలకు తరలించారని తేలింది. 1996 మార్చి 11న దాణా కుంభకోణంపై విచారించాలని సిబిఐకి పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. విచారణను పర్యవేక్షించేందుకు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ, నేరారోపణల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీదేవిని బీహార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సిబిఐ కోర్టులో లాలూ ప్రసాద్ యాదవ్ లొంగిపోయారు. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన విచారణలో లాలూ ప్రసాద్‌ను దోషిగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వచ్చే నెల్లో ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







