చరణ్ తో అనసూయ తనయుడు సెల్ఫీ..!! అద్భుతమైన వ్యక్తి అతను..!!
- December 24, 2017
బుల్లి తెరపై యాంకర్ గా ఫేమస్ అయిన "అనసూయ" వెండి తెరపై అడుగు పెట్టింది. "సోగ్గాడే చిన్ని నాయన" సినిమాలో నాగ్ మరదలిగా ఆడిపాడిన అనసూయ.. "క్షణం" సినిమాలో విలనిజం ఉన్న పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించింది.. ఇటీవల ఐటెమ్ సాంగ్స్ లో కూడా ఆడిపాడుతున్న అనసూయ.. రామ్ చరణ్ తాజా సినిమా రంగస్థలంలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటున్న అనసూయ.. తాజాగా తన కుమారుడితో కలిసి రామ్ చరణ్ తో సెల్ఫీ దిగింది.. ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అద్భుతమైన వ్యక్తి.. రామ్ చరణ్ తో సెల్ఫీ దిగిన ఫోటో మీతో పంచుకుంటున్నా.. ఈ ఫోటో.. రంగస్థలం సినిమాలో సెట్స్ పై.. ఓ అద్భుతమైన సన్నివేశం తెరకెక్కించాక దిగిన సెల్ఫీ అని కామెంట్ కూడా ఆ ఫోటోకి జతచేసింది. అంతేకాదు.. ఆ సన్నివేశం ఏమిటో సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఎదురు చూడండి.. చరణ్ మనల్ని గర్వ పడేలా చేస్తాడు అని ట్వీట్ చేసింది.. సుకుమార్ దర్శకత్వంలో 1985 లో వాతావరణం ప్రతిబింబిస్తూ.. తెరకెక్కిస్తున్న గ్రామీణ నేపథ్య ప్రేమ కథా చిత్రం రంగస్థలం.. చరణ్ తో తొలిసారిగా సమంత జోడీ కట్టగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







