వీఐపీ గదిని కేటాయించినా, నిద్రపోలేని లాలూ
- December 24, 2017
రాంచీ : గడ్డి కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిర్సా ముండ జైలులో ఖైదీగా ఉన్నారు. లాలూ యాదవ్‌కు జైలులో ఖైదీనెంబర్ 3351, వీఐపీ గదిని కేటాయించారు. లాలూకి రాత్రి రోటీ, పాలక్ కర్రీని అందించినట్లు జైలు అధికారులు తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం లాలూకు టీ, బిస్కెట్లు అందించినట్లు వారు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆదివారం నాడు లాలూని కలిసిందుకు ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు.
వీఐపీ గది.. రాజభోగాలు
బిర్సా ముండల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూప్రసాద్ యాదవ్‌కు జైలు అధికారులు వీఐపీ జైలు గదిని కేటాయించారు. ఈ గదిలో ఆటాచ్ బాత్రూమ్‌తో పాటు, కేబుల్ కనెక్షన్ ఉన్న టీవీ సెట్, అవసరమైన మందులు, దోమతెర, దిండు, కుర్తా - ఫైజామా జత బట్టలు, చలిని తట్టుకునేందుకు అనువైన బ్లాంకెట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. జైల్లో ఆయనే స్వంతంగా ఆహారాన్ని వండుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.
నిద్రలేని రాత్రి
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో జైలు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి జైలు పక్షిలా మారారు. జైలులో లాలూకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినా.. రాత్రంతా జైలులో నిద్రపోలేదని అధికారులు చెబుతున్నారు. అటూఇటూ తిరుగుతూ, దీర్ఘంగా ఆలోచిస్తూ.. రాత్రిని గడిపారని చెబుతున్నారు. ఉదయాన్నే జైలు గదిని బయటకు వచ్చిన లాలూ.. కూరగాయలు తోటను పరిశీలించి.. అక్కడే మార్నింగ్ వాక్ చేశారని జైలు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







