సీరియల్స్ లో నటించటానికి నేను రెడీ: ఇలియానా
- December 24, 2017
ఇలియానా.. గోవా బ్యూటీ. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది. ఇపుడు అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది. అయినా ఈ ముద్దుగుమ్మకు నటనపై ఉన్న మోజు చనిపోలేదు. అందుకే బుల్లితెరపై కనిపించాలని ఉవ్విళ్ళూరుతోంది.
అందుకే అవసరమైతే టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. తనకు సీరియల్స్ అంటే చాలా ఇష్టమని అందులో కూడా ఎమోషన్స్‌తో కూడుకున్న సన్నివేశాలు చాలా బావుంటాయని చెబుతూ.. బుల్లి తెరపై గుర్తుండిపోయే అవకాశం వస్తే ఎలాంటి అడ్డు చెప్పను అని కుండబద్దలు కొట్టేసింది.
సాధారణంగా చాలా మంది బుల్లితెర తారలు సినిమాల్లోకి రావడాన్ని గొప్పగా ఫీలవుతారు. అదో గొప్ప అచీవ్‌మెంట్‌గా చెప్పుకుంటారు. అలాంటిది ఇలియానా రివర్స్‌లో సీరియల్స్‌లోకి వెళతాను అని అనటంతో ఆశ్చర్యపోతున్నారు బాలీవుడ్ సినీజనం. ఇల్లూ బేబీ ప్రస్తుతం అజయ్ దేవ్‌గన్‌తో ఓ సినిమా, మరో ఇద్దరు హీరోల సినిమా చేస్తోంది. ఒకవేళ ఆ రెండు సినిమాలు నిరాశ పరిస్తే బుల్లితెరపైనైనా ఓ వెలుగు వెలగవచ్చని ముందుజాగ్రత్త చర్యగా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటుందంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!







