టెకీల పెళ్లి.. బిట్కాయిన్లే బహుమతులు!
- December 24, 2017
బెంగళూరు : బిట్‌కాయిన్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టోకరెన్సీ చుట్టే చర్చ నడుస్తోంది. అయితే ఈ వర్చ్యువల్ కరెన్సీ బుడగలాంటిదని.. ఎప్పుడైనా పేలే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలను ఓ బెంగళూరు జంట ఏమాత్రం పట్టించుకోలేదు. తమ వివాహ వేడుకను వినూత్నంగా నిర్వహించాలని అనుకున్నారు. ఇందుకోసం బిట్‌కాయిన్‌ను ఉపయోగించుకున్నారు. అది ఎలా అంటే.. అతిథులు ఇచ్చే బహుమతులను బిట్‌కాయిన్ రూపంలో చెల్లించే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రశాంత్, నీతి.. బెంగళూరుకు చెందిన టెకీలు. వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే అందరిలాగా కాకుండా వినూత్నంగా తమ పెళ్లి అందరికీ గుర్తుండేలా నిర్వహించాలని ఆలోచించారు. ఇద్దరూ సాఫ్టవేర్ ఇంజినీర్లే కావడంతో వారి దృష్టి వర్చ్యువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌పై పడింది. ఇందులో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఈ జంట.. తమకు అందే బహుమతులను అతిథులు బిట్‌కాయిన్ రూపంలో చెల్లిస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు.
అందుకు తగ్గట్టుగా వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఇందుకోసం ఆహ్వాన పత్రికల్లో ఓ క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఇది ఇండియన్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్ అయిన 'జెబ్‌పే'తో అనుసంధానమై ఉంటుంది. బహుమతుల ద్వారా శుభాకాంక్షలు చెప్పాలనుకునేవారు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని బిట్కాయిన్ల రూపంలో గిఫ్ట్‌లను పంపాలని సూచించారు.
ఆహ్వాన పత్రిక వెనక ఇందుకోసం పలు సూచనలను కూడా చేశారు. 'మా వివాహానికి హాజరయ్యే అతిథుల్లో ఎక్కువ మంది టెక్నాలజీ, స్టార్టప్‌ల రంగాలకు చెందినవారు. పలువురు పెట్టుబడిదారులు కూడా. కావున కాస్త వినూత్నంగా ఆలోచించాం. ప్రస్తుతం చర్చ నడుస్తున్న బిట్‌కాయిన్ టెక్నాలజీని మేం ఎందుకు వాడుకోకూడదు అని అనుకున్నాం.
అలాగే ఈ క్రిప్టోకరెన్సీ వెనక ఉన్న టెక్నాలజీపై అవగాహన పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాం. జెబ్పేతో మేం భాగస్వాములై దీన్ని అతిథులకు అందించాం.' అని ప్రశాంత్, నీతి తెలిపారు. డిసెంబర్ 9న వీరి వివాహం జరిగింది. వివాహానికి 200 మంది అతిథులు హాజరయ్యారు. వీరిలో 95 శాతం మంది బిట్‌కాయిన్ రూపంలోనే బహుమతులు అందించారని ఈ నూతన జంట ఆనందంగా తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల