విమాన ప్రయాణికులు తప్పక తెలేసుకోవలసిన విషయాలు
- November 18, 2015
మీరు విమాన ప్రయాణం చేస్తున్నారా? చాలావరకు ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ప్రయాణీకులకు కొన్ని విషయాల గురించి చెప్పవు. కాని వాటి గురించి ప్రయాణికులు తప్పక తెలుసుకోవాలి. బెస్ట్ సీట్స్ కావాలంటే ఎలా, ఎప్పుడు ఎంపిక చేసుకోవాలి దగ్గర్నించీ విమానంలో చేయకూడని కొన్ని పనుల వరకు ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి...
ప్రయాణికులందరూ విమానంలో కూర్చున్నాక ఎయిర్ హోస్టెస్ సేఫ్టీ డెమో చేసి చూపిస్తుంది. ఆ డెమోలో అకస్మాత్తుగా ప్రమాదం సంభవిస్తే ఎమర్జెన్సీ డోర్లు ఎటువైపు ఉన్నాయి, ఆక్సిజన పైపు ఎక్కడుంది వంటి వివరాలు చెప్తారు. అంతేకాని రాత్రిపూట క్యాబిన్ లైట్లను డిమ్ చేయడం గురించి గాని, విమానం టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ట్రే టేబుల్స్‌ను మూయమని ఎందుకు చెప్తారని గాని చెప్పరు. చీకటికి కళ్లను అలవాటు చేసేందుకు డిమ్‌లైట్లు వేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రే టేబుల్స్‌ను మూసేయమంటారు.
ఇంధనం విషయంలో ఎయిర్‌లైన్స్ పిసినారితనంగా వ్యవహరిస్తాయి. బరువైన విమానం గాల్లో పైకి ఎగరాలంటే ఇంధనం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అందుకనే వాతావరణంలో మార్పులు వచ్చి విమాన ప్రయాణానికి ఇబ్బంది కానప్పటికీ అనివార్య కారణాల వల్ల విమానం నడపలేకపోతున్నాం అంటారు. ఇంధనం ఆదా అన్నమాట.
కొన్ని ఎయిర్లైన్స విమానాల్లో మోతాదుకు మించి టికెట్లు మంజూరు చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వాళ్లిచ్చే వోచర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించొద్దు. స్వచ్ఛందంగా ప్రయాణాన్ని విరమించుకునేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో ఎయిర్‌లైన్స్ వాళ్లే బలవంతంగా మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోమంటారు. కాంపన్సేషనగా డబ్బులు ఇస్తామంటారు. ఎయిర్‌పోర్టులోనే చెక్ రాసిస్తారు. అయితే ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్టుమెంట్ నియమం ప్రకారం మీ టికెట్ ధర, మీరు ఎంతసేపు ఎదురు చూడాల్సి వచ్చిందనే విషయాల మీద ఆధారపడి విమాన సంస్థలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
గ్రూప్‌గా టికెట్లు బుక్ చేయొద్దు. ఒక్కో టికెట్‌ను బుక్ చేసే పద్ధతే మంచిది. ఎందుకంటే మీరు నాలుగు టికెట్లు బుక్ చేయాలి. ఎయిర్లైన్స వాళ్ల ఆఫర్లో మూడు టికెట్లు తక్కువ ధరకు వస్తున్నాయి. కానీ మీరు గ్రూపులో నాలుగు టికెట్లు బుక్ చేయడం వల్ల తక్కువ ధరలో రావాల్సిన మూడు టికెట్లు కూడా ఆఫర్లేని ధరకే వస్తాయి.
కొన్ని ఎయిర్ లైన్స్ ఇద్దరు పైలట్లు గంటలోపు ఒకే దగ్గర తయారైన ఆహారాన్ని తినడాన్ని అనుమతించవు. ఇద్దరూ వేరు వేరు రెస్టారెంట్లలో తినాలి. లేదా ఆహారం తిన్న గంట తరువాత ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసుకున్నాకే మరొకరు తినాలి.
లగేజి పోతే ఆ విషయాన్ని వెంటనే రిపోర్టు చేయాలి. డెడ్‌లైన్ అయిపోయిందంటే మీ క్లయిమ్ అంగీకరించరు.
బోయింగ్ 777ను అంతర్జాతీయ ప్రయాణాలకు వాడతారు. ఈ విమానంలో సీట్ల వైశాల్యం ఒక అంగుళం మేర తగ్గిపోయింది. ఇలా చేయడం వల్ల ఒక్కో వరుసలో అదనంగా మరో సీటు వేయొచ్చనేది ఎయిర్లైన్స ఆలోచన.
విమానం రద్దయితే టికెట్ డెస్క్ లేదా గేట్ కౌంటర్ వద్ద వరుసలో నిల్చోండి. మీ ఫోన్ కూడా దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే డెస్క్ దగ్గర సమాధానాలు చెప్తూ విసుగెత్తిపోయిన ఏజెంట్‌తో మాట్లాడకముందే ఎయిర్ లైన్ ఏజెంట్ మీకు ఫోన్ చేయొచ్చు.
విమానం ఎక్కబోయే వంద గంటలు అంటే నాలుగు రోజుల ముందుగానే సీటింగ్ మ్యాప్ చెక్ చేసుకోవచ్చు. కోచ్ నుంచి బిజినెస్ వరకు బెస్ట్ సీట్లను అప్పుడే ఓపెన్ చేస్తారు.
విమానంలో కాళ్లకి చెప్పులు లేకుండా నడవకూడదు. ఎందుకంటే ఆ కార్పెట్ మీద ఎవరైనా వాంతి చేసుకునుండొచ్చు, పాలు పడుండొచ్చు, చిన్న పిల్లలు సూసు చేసుండొచ్చు... అందుకనే చెప్పుల్లేకుండా నడిచేవాళ్లని వింతగా చూస్తారు ఎయిర్లైన్స వాళ్లు.
ఎయిర్‌లైన్స్ వాళ్లే విమానాన్ని రద్దు చేస్తే వాళ్లే మిమ్మల్ని వేరే విమానంలో ఎక్కిస్తారు. అయినప్పటికీ నాన్‌రిఫండబుల్ చార్జీలని మీరడిగితే వెనక్కిస్తారు
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







