తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు...!!
- December 24, 2017
తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చ్‌లో అర్థరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. క్రీస్తు పుట్టినరోజు సందర్బంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. 176 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ చర్చ్ కు ప్రార్థనల కోసం వేలాదిగా తరలివచ్చారు. క్రిస్మస్ ప్రత్యేక ఏర్పాట్లతో, విద్యుద్దీపాల వెలుగులతో సెయింట్ మేరీస్ చర్చి వెలిగిపోయింది.
ప్రకాశం జిల్లాలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు, చీరాల, కందుకూరు.. ఇతర పట్టణాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జిరగాయి. క్యాండిల్ ప్రదర్శనలు, చిన్నారుల నృత్యరూపకాలు జరిగాయి. ఒంగోలు జేఎంటీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మాగుంట సహా వందలాది మంది పాల్గొన్నారు. అతిపురాతన జ్యువెల్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి.
ఏలూరులో కూడా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. నగరంలోని చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. అర్థరాత్రి 12 నుంచి కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం







