దుబాయ్‌ చెక్కేసిన పెళ్లిళ్ల ఏజెంట్ హబీబ్‌ఖాన్‌

- December 24, 2017 , by Maagulf
దుబాయ్‌ చెక్కేసిన పెళ్లిళ్ల ఏజెంట్ హబీబ్‌ఖాన్‌

హైదరాబాద్‌: అమాయక యువతులపై నిఖా పేరిట దగా చేస్తున్న బ్రోకర్లు, ఖాజీలపై ఉక్కు పాదం మోపుతాం. ఆయా నిందితులపై పీడీయాక్టులు ప్రయోగించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించి కార్యాచరణలోకి దిగక ముందే పోలీసుల కళ్లు గప్పి మరో ఖాజీ దుబాయ్‌ పారిపోయాడు. ఖాజీలు, వారికి సహకరించిన ఏజెంట్లు ఏ క్షణంలోనైనా పారిపోయే అవకాశముందని స్వయానా పోలీసులే ప్రకటించారు. వారి పాస్‌పోర్టులను సీజ్‌ చేస్తామని చెప్పారు. కానీ కొంతమంది మాత్రం పోలీసులకే షాకిస్తున్నారు. ఇదే తరహాలో ఫలక్‌నుమాకు చెందిన మహమ్మద్‌ హబీబ్‌ ఖాన్‌ అనే ఏజెంటు దుబాయ్‌కు పారిపోయాడు. అరబ్బు షేక్‌లతో పెళ్లిళ్లు జరిపించడంతో పాటు నకిలీ ఖాజీల ద్వారా కూడా నిఖాలు జరిపించినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. ఇటీవల అరెస్టు చేసిన ఖాజీలతో పాటు జైలుకు వెళ్లిన హబీబ్‌ ఖాన్‌ బెయిల్‌పై విడుదలై నేరుగా దుబాయ్‌ పారిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com