పోస్ట్ ప్రొడక్షన్‌లో 'కొత్త కుర్రాడు' సినిమా
- December 26, 2017
శ్రీరామ్, శ్రీప్రియ జంటగా లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మిస్తున్న చిత్రం 'కొత్త కుర్రాడు. రాజానాయుడు ఈ చిత్రానికి దర్శఖుడు . చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజా నాయుడు మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుందని అన్నారు. శ్రీరామ్, శ్రీప్రియకొత్త వారయినా పోటీపడి నటించారని , ప్రతినాయకుడిగా చేబ్రోలు శ్రీను నటన అద్భుతంగా ఉందన్నారు. ఉభయగోదావరి, అరకు, విశాఖ, భీమిలి వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, సాయి ఎలెందర్ సంగీతం ఆకట్టుకుంటుందన్నారు. త్వరలోనే పాటలను విడుదల చేస్తామన్నారు. నిర్మాత అచ్చన దొర మాట్లాడుతూ, చిత్రీకరణ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







