'బటర్ ఫ్లయిస్' సినిమా ఫస్ట్‌లుక్
- December 26, 2017
నిర్మాతగా వంద చిత్రాలకు చేరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్‌పై 92 చిత్రంగా బటర ఫ్లయిస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఫణిరాజ్ దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందరూ ఆడవాళ్లే నటిస్తుండటం విశేషం. జోత్సశర్మ, హర్షిణి, మేఘనానాయుడు, రోజాభారతి తదితరులు లీడ్‌రోల్స్‌లో నటిస్తున్నారు. సీనియర్ రాజకీయ నేత , ఎపి మాజీ సిఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్యగారు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామసత్యనారాయణ సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న వ్యక్తి వంద సినిమాలకు చేరువయ్యారు. అందరూ ఆడవాళ్లతోచేస్తున్న ఈచిత్రం ఓ మంచి ప్రయోగం అన్నారు. అలాగే సక్సెస్‌ఫుల్ సినిమా చేయాలని ఆశిస్తున్నానన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ, సినిమా చిత్రీకరణ పూర్తయిందని, జనవరి 26న విడుదల చేయనున్నామన్నారు. రోశయ్యగారు ఫస్ట్‌లుక్‌ను విడుదలచేయటం ఆనందంగా ఉందన్నారు. అందరూ ఆడవాళ్లే నటిస్తున్న ఈచిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. ప్రధానపాత్రలో జోత్స శర్మ , హర్షిఫి, మేఘనా, రోజాభారతి, జయ, ప్రవళ్లిక తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల