పెప్పర్ చికెన్
- December 26, 2017
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూను
టమాటా ముక్కలు - 1 కప్పు
మిరియాల పొడి - 1 టీస్పూను
ఉప్పు - తగినంత
కారం - అర టీస్పూను
గరం మసాలా - అర టీస్పూను
కరివేపాకు - 1 రెమ్మ
షాజీరా - అర టీస్పూను
యాలకులు - 2
దాల్చిన చెక్క - 1 అంగుళం
లవంగాలు - 3
నూనె - 2 టీ.స్పూన్లు
మారినేషన్ కోసం:
చికెన్ - అర కిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3/4 టీస్పూను
పసుపు - పావు స్పూను
ఉప్పు - కొద్దిగా
తయారీ విధానం:
చికెన్ కడిగి పైన చెప్పిన పదార్థాల్లో మారినేట్ చేయాలి.
బాండీలో నూనె పోసి షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి.
తర్వాత ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
టమాటా ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
టమాటా మెత్తబడ్డాక కారం, గరం మసాలా వేసి, మిరియాల పొడి వేయాలి.
నీరంతా ఇగిరిపోయేవరకూ వేయించాలి.
తర్వాత చికెన్ ముక్కలు వేసి పెద్ద మంట మీద 3, 4 ని.లు వేయించాలి.
తర్వాత మంట తగ్గించి ముక్కలు మెత్తగా ఉడికేవరకూ కలుపుతూ ఉండాలి.
ఇలా 10 - 15 ని.లపాటు వేయిస్తే ముక్కలు పొడిగా తయారై బాగా వేగుతాయి.
ప్లేట్‌లోకి తీసుకుని వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







