సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారా?

- December 26, 2017 , by Maagulf
సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారా?

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మిగతా ఆరోగ్యం మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరికి వూబకాయం, మధుమేహం వంటి జీవక్రియల జబ్బుల ముప్పూ పెరుగుతున్నట్టు స్వీడన్‌ అధ్యయనం పేర్కొంటోంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిలో సెక్స్‌ హార్మోన్లు, ఇతర జీవరసాయనాల స్థాయులను పరిశీలించగా.. చాలామందిలో సెక్స్‌ హార్మోన్లు తక్కువగా ఉండటంతో పాటు జీవక్రియ జబ్బులు, ఎముక క్షీణత లక్షణాలూ బయటపడటం గమనార్హం. సెక్స్‌ హార్మోన్ల స్థాయులు తక్కువగా గలవారి రక్తంలో హెచ్‌బీఏ1సీ మోతాదులు కూడా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ఇది ఇన్సులిన్‌ నిరోధకతకు బలమైన సూచిక. అంటే వీరికి మున్ముందు మధుమేహం ముప్పూ పెరుగుతుందన్నమాట. అందువల్ల సంతాన సమస్యలు ఎదుర్కొనే పురుషులందరికీ సెక్స్‌ హార్మోన్ల స్థాయులను పరిశీలించటం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే తీవ్రమైన సమస్యల ముప్పు గలవారిని సంతాన చికిత్సల అనంతరమూ పరిశీలించటం అవసరమని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com