ఒమన్‌లో వలసదారుల వీసా కోసం కొత్త 'ఇ-సర్వీస్'
- December 26, 2017
మస్కట్: మ్యాన్ పవర్ మినిస్ట్రీని సంప్రదించకుండానే యజమానులు వలస కార్మికుల్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా వన్ డే ఆన్లైన్ సర్వీస్‌ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుల్తానేట్‌లో నివసిస్తోన్న నాన్ ఒమనీ వర్కర్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఈ సర్వీస్ వెసులుబాటు కల్పిస్తుంది. ఐదు రియాల్స్ ఫీజుతోనే ఈ సేవల్ని పొందడానికి వీలుంటుందని మినిస్ట్రీ ఆన్లైన్ ద్వారా వెల్లడించింది. యజమాని ముందుగా ఇ-సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. 'మేన్ పవర్ సర్వీస్ ట్రాన్స్ఫర్'లో రిజిస్టర్ అయ్యాక, అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇ-మెయిల్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా సర్వీస్ అలర్ట్స్ యజమానికి సమాచారం అందుతుంది. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్లైన్ ద్వారా ఈ సేవలు పొందే వీలు కలగడం చాలా గొప్ప విషయమని ఓ ప్రైవేటు సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎస్ గుప్తా చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







