ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోన్న అజ్ఞాతవాసి
- December 27, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అజ్ఞాతవాసి. హారికా అండ్ హాసినీ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ సంక్రాంతికి సందడి చేయబోతుంది. జనవరి 10న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అజ్ఞాతవాసి పవన్ కి 25వ చిత్రం. అలాగే త్రివిక్రమ్ తో హాట్రిక్ మూవీ. అందుకే ఎక్స్ పెక్టేషన్స్ తారా స్థాయిలో ఉన్నాయి. దీంతో నిర్మాత బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలను వరల్డ్ వైడ్ గా ప్లాన్ చేశారు.
ఫస్ట్ లుక్ టీజర్ చూసి, ఆడియో సాంగ్స్ విని ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇప్పుడు ధియేట్రికల్ ట్రైలర్ తో పాటు పవన్ కళ్యాణ్ పాడిన స్పెషల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి పవన్ పాడిన కొడుకా కోటేశ్వరరావు అనే సాంగ్ ని, న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ధియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 4న లేదా 5న విడుదల చేసే ఆలోచనలో ఉంది అజ్ఞాతవాసి టీమ్.
ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్సో తో ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఇక పవన్ పాడిన పాటతో పాటు, ధియేట్రికల్ ట్రైలర్ వచ్చాక సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత ఎక్కువవుతాయనడంలో సందేహం లేదు. ఈ హైప్ వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో అజ్ఞాతవాసికి ఓపెనింగ్స్ రికార్డ్ రేంజ్ లో వస్తాయని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ ఈ అజ్ఞాతవాసితో ఎలాంటి రికార్డ్స్ సాధిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







