ఢోఫర్ లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు ఒమాన్ పౌరులు అరెస్టు
- December 27, 2017
మస్కట్: దొంగతనం ఆరోపణలపై నల్గురు ఓమనియులు అరెస్టయ్యారు, సలాలా దాడిలో పోలీసు అధికారుల వేషంలో ఒక ఇంటిలో ప్రేవేశించి దొంగతనంకు పాల్పడ్డారు. సలాలా పోలీస్ సహకారంతో దోఫర్ పోలీస్ కమాండ్‌లో విచారణ మరియు క్రిమినల్ పరిశోధన విభాగం ఆ నల్గురు దొంగలను నిర్బధించాయి. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, "నల్గురు ఒమాన్ పౌరులు పోలీసుల మాదిరిగా మారువేషంలో సలాలాలోని ఒక అపార్ట్మెంట్లో ప్రవేశించి, అక్కడివారి వద్ద నుంచి మొబైల్ ఫోన్ లను తీసుకొన్నారు. ఆ తర్వాత వారివద్ద నుంచి డబ్బును దొంగిలించి అక్కడి నుండి పారిపోయారు. " బాధితులు ఫిర్యాదు చేసిన తరువాత, పోలీసులు నేరస్తులను పెట్టుకొనేందుకు తీవ్ర యత్నం చేసి ఆ దొంగలను పట్టుకొన్నారు. " నిందితులు తమ నేరం ఒప్పుకున్నాడు. అలాగే గతంలోనూ ఇదే తరహాలో మూడు నేరాలకు పాల్పడినట్లు అంగీకరిస్తూ అందుకు తమదే బాధ్యతవహించారు. నిందితులపై విచారణను పూర్తి చేయడానికి న్యాయ అధికారుల వద్దకు వారిని సూచించారు. "
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







