ఫోన్ లో తలాక్ చెప్పిన భర్త
- December 27, 2017
ఒమన్ షేక్ చేతిలో దారుణంగా మోసపోయింది పాతబస్తీకి చెందిన గౌసియా బేగం. ఎనిమిదేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్న ఒమన్ షేక్.. ఫోన్లో తలాక్ చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహించిన ఖాలా, ఖాలూలను నిలదీస్తే.. మరో వివాహం చేస్తామంటున్నారంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌసియా. తనకు న్యాయం చేయాలంటూ కోరుతోంది.
కాంట్రాక్ట్ మ్యారేజ్‌ల కారణంగా అమ్మాయిల జీవితాలు నాశమనమైపోతాయని తెలిసినా.. పాతబస్తీలో మార్పు రావడం లేదు. తాత్కాలికంగా అందే డబ్బుకు ఆశపడి.. తమ కూతుళ్లను ఒమన్ షేక్‌ల చేతుల్లో బలిపశువులను చేస్తున్నారు పేదింటి తల్లిదండ్రులు. గౌసియా బేగం తల్లిదండ్రులు కూడా.. ఎనిమిదన్నరేళ్ల క్రితం ఒమన్షేక్ జహరన్ హమీద్ అల్ రజీ అనే వృద్ధుడికిచ్చి పెళ్లి చేశారు. దాదాపు ఎనిమిది మంది అమ్మాయిలను చూసిన తర్వాత.. తనను హమీద్ సెలెక్ట్ చేసుకున్నాడంటోంది గౌసియా. ఖాలా, ఖాలూలు తనను హమీద్ దగ్గరకు తీసుకెళ్లారంటోంది. హైదరాబాద్‌లో ఇల్లు కొనిస్తాననని ఆ సమయంలో హామీ ఇచ్చాడంటోంది. 2008 ఆగస్టు 11న హైదరాబాద్‌లోనే గౌసియా, హమీద్‌కు నిఖా జరిగింది. కొన్ని రోజులు ఇక్కడే ఉన్న హమీద్..గౌసియాను వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ప్రతీ ఏటా హైదరాబాద్ వస్తూ.. కొన్ని రోజులు ఉండి వెళ్లి పోతున్నాడు. ఇల్లు సంగతిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు సడన్‌గా ఫోన్ చేసి తలాక్ చెప్పాడంటూ కన్నీటి పర్యంతం అవుతోంది.
ఒమన్ షేక్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలని కోరుతూ.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాసింది గౌసియా. తనలాంటి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ఖాలా, ఖాలూలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







