లక్నో:రన్‌వేపై నిలిచిపోయిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం
- December 27, 2017
సౌదీ ఎయిర్లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోవడం కలకలం రేపింది. లక్నో నుంచి రియాద్ వెళ్లాల్సిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం రన్‌వే పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అర్థాంతరంగా రన్‌వే పైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో కొన్ని విమానాలను దారి మళ్లించడం తోపాటు, మరికొన్ని సర్వీసులను నిలిపివేశారు. దీంతో సిబ్బంది, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. లక్నో-రియాద్ విమానం గాల్లోకి ఎగిరే క్రమంలో రన్‌వేపైనే నిలిచిపోయింది. ఈ సంఘటనతో విమానాశ్రాయానికి వచ్చి వెళ్లే పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరు విమానాలను ఢిల్లీకి మళ్లించారు. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో మూడు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే విమాన సిబ్బంది, ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!